రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా బిజీలో ఉన్నాడు. ఖాళీ సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న చరణ్ రీసెంట్ గా తమ్ముడు వరుణ్ తేజ్ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న వాల్మీకి సినిమా ఏప్రిల్ 16 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది. తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.