యాసిడ్ బాధితురాలు పాత్రలో దీపికా

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 25, 2019, 11:17 AM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దీపిక పదుకొనె ఒకరు.బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పెళ్లి చేసుకున్న దీపికా  వెండితెరపై మెరిసి ఏడాది అవుతోంది హీరోలతో సమానమైన పారితోషికం తీసుకోవడం ఆమెకి గల క్రేజ్ కి నిదర్శనం. ఇక కొన్ని సినిమాలకి హీరోకన్నా ఎక్కువగానే పారితోషకం తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటి దీపిక తాజాగా ఒక బయోపిక్ చేస్తోంది. ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మేఘన గుల్జార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి 'ఛపాక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి దీపిక పదుకొనె ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. యాసిడ్ దాడి జరిగిన అనంతరం స్టిల్ ను ఫస్టులుక్ గా వదిలారు. గ్లామర్ క్వీన్ గా మార్కులు కొట్టేసిన దీపిక, 'ఛపాక్'లో ఈ తరహా లుక్ తో కనిపించడానికి సిద్ధపడటం సాహసమేనని చెప్పాలి. 2020 జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా ఈ ఫస్టు పోస్టర్ ద్వారానే ప్రకటించారు.


 
Recent Post