హైదరాబాద్‌లో కొలువైన మహేష్ బాబు మైనపు విగ్రహం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 25, 2019, 12:15 PM

సూపర్ స్టార్‌ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతని పాపులారిటీని గుర్తించిన  ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు గుర్తించి అతని మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో పెట్టబోతున్నారు. కానీ ఈ మైనపు విగ్రహాన్ని ముందుగా సింగపూర్‌లో కాకుండా హైదరాబాద్‌లో ఈ రోజు AMB సినిమాస్‌లో మహేష్ బాబు  తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అంతేకాదు తన మైనపు విగ్రహంతో సెల్ఫీ కూడా దిగాడు. అంతేకాదు తన భార్య, కూతురు సితార, కొడుకు గౌతమ్ కృష్ణలతో కలిసి మైనపు విగ్రహంతో ఫోటో దిగారు. ఈ మైనపు విగ్రహాన్ని మహేష్ బాబు చూస్తే ఎవరు మహేష్ బాబో చెప్పడం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. మొత్తానికి మహేష్ బాబు మైనపు విగ్రహంగా కొలువు కావడాన్ని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ మైనపు విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. ఆ తర్వాత ఈ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్‌కు తరలిస్తారట. ఇప్పటి వరకు ఏ ఒక్కరి మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ కొలువైన ప్రదేశంలో కాకుండా వేరే చోట మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇదే మొదటిసారి.ఇందులో ఎవరిదైన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే అ మనిషికి సంబంధించిన 200 పైగా కొలతలు తీసుకుంటారు. అంతేకాదు ఆ వ్యక్తికి సంబంధించిన హెయిర్ కలర్, కళ్ల రంగు వంటివి వాటిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.


ప్రపంచ వ్యాప్తంగా మేడమ్ టుస్సాడ్స్‌కు సంబంధించిన మ్యూజియాలు 23 లొకేషన్స్‌లో కొలువై ఉన్నాయి. ప్రతి ఏట ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కొలువైన ఈ మైనపు మ్యూజియాలను  కోటి మందిపైగా సందర్శిస్తూ ఉంటారు.ఇక దక్షిణాదిన ప్రభాస్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు సంపాందిచుకున్న రెండో హీరోగా మహేష్  రికార్డులకు ఎక్కాడు. మొత్తానికి మహేష్‌తో ఫోటో దిగని వాళ్లు..అచ్చం ఆయన పోలి ఉండే ఈ విగ్రహంతో ఎంచక్కా సెల్సీలు  తీసుకోవచ్చు.
Recent Post