ఐటమ్ గర్ల్‌గా పాయల్

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 25, 2019, 12:51 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ''టైగర్ నాగేశ్వరరావు'' బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్‌ను తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆర్ఎక్స్ 100 ద్వారా యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న ఈమె గజదొంగగా తెరకెక్కే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో హీరోయిన్‌గా నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.  


 1980 - 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వరరావు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇంతకుముందు వంశీకృష్ణ దర్శకత్వం వహించిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' ఫరవాలేదనిపించుకుంది. 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలో కథానాయికగా ఇంకా ఎవరినీ తీసుకోలేదట. ఇంకా పాయల్ రాజ్‌పుత్‌ను ఈ సినిమా కోసం తీసుకోనున్నట్లు ప్రచారం సాగినా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 


 మరోవైపు పాయల్ రాజ్‌పుత్ ఐటమ్ గర్ల్‌గా మెరవనుంది. ప్రస్తుతం డిస్కో రాజా, వెంకీ మామ సినిమాలతో పాటు మరో రెండు సినిమాల్లో పాయల్ నటిస్తోంది. తాజాగా తేజ దర్శకత్వం వహించిన సీత సినిమాలో పాయల్ ఓ పాటకు చిందులేయనుందని తెలిసింది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో పాయల్ డ్యాన్స్‌తో కూడిన స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.
Recent Post