నయనతారపై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన డిఎంకె నేత‌...

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 25, 2019, 10:13 PM

ప్రముఖ హీరోయిన్ నయనతారపై అభ్యంతరకర భాష ఉపయోగించిన డీఎంకే నేత, నటుడు రాధారవిపై ఆ పార్టీ సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా చర్యల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే జనరల్ సెక్రెటరీ కే అంబుజ్గన్ తెలిపారు. నయనతార నటించిన కొలైయుదిర్ కాలమ్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రాధారవి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధారవి మాట్లాడుతూ.. నయనతార ఇపుడు పెద్ద స్టార్, లేడీ సూపర్‌స్టార్. కొందరు ఆమెను పురచ్ఛి తలైవార్ ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి వారితో పోలుస్తున్నారు. అలాంటి వ్యక్తులతో నయనతారను పోల్చడం కొంత ఇబ్బందికరంగా ఉందన్నారు. నయనతార మంచి నటి, అందులో ఏమాత్ర సందేహం లేదని ఒప్పుకుంటాను. కొన్నేళ్లు ఆమె ఇండస్ట్రీలో పడరాని పాట్లు పడ్డారు. ఆమెపై పలు రకాల ఆరోపణలు, విమర్శలు వచ్చినా తట్టుకుని ఆమె నిలదొక్కుకున్నారు. కానీ తమిళ ప్రజలు ఏ విషయాన్నైనా నాలుగు రోజులు గుర్తుంచుకుని, మరిచిపోతారన్నారు. నయనతార దెయ్యంలా, దేవతలా నటించింది. దేవతల పాత్రల కోసం దర్శకులు గతంలో కేఆర్ విజయ లాంటి గొప్ప మహిళలను ఎంపిక చేసుకునేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో గౌరవ ప్రదమైన వారితో పాటు ఎవరితో తిరిగేవాళ్లైనా సరే దేవతల పాత్రలో నటించవచ్చంటూ చేసిన కామెంట్లు దుమారాన్ని రేపుతున్నాయి
Recent Post