మార్చి 29న వ‌స్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 12:48 AM

ఎన్టీఆర్ జీవిత క‌థ‌లో చివ‌రి రోజుల‌లోని  కొన్ని ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన  లక్ష్మీస్ ఎన్టీఆర్.సినిమా విడుదలకు  అడ్డంకులు తొలగి పోయాయి. సోమ‌వారం  ప్రసాద్ లాబ్స్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ను ప్ర‌త్యేకంగా చూసిన సెన్సార్ ఆఫీసర్ క్లిన్ U సర్టిఫికెట్ ను జారీ చేసారు. దీంతో మార్చి 29న రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు సెన్సార్ చిక్కులు తొలగినట్టే న‌ని నిరా్మ‌త‌లు చెప్పారు. కాగా, ఈ సినిమాను తొలిదశ ఎన్నికల తరువాత విడుదల చేసుకోవాలంటూ సెన్సార్ బోర్డు అధికారుల నుంచి తనకు సమాచారం వచ్చిందని, ఇది హక్కులకు భంగమని, తాను కోర్టుకు వెళతానని వర్మ హెచ్చరించిన  నేప‌థ్యంలో ప్ర‌త్యేకంగా అధికారిని నియ‌మించి చిత్ర వీక్ష‌ణ త‌దుప‌రి స‌ర్టిఫికెట్ జారీ చేసిన‌ట్టు స‌మాచారం. 
Recent Post