ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారెన్స్ ట్రస్ట్‌కు మెగా విరాళం

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 11:55 AM



ప్రముఖ కొరియోగ్రాఫర్‌, హీరో రాఘవ లారెన్స్‌కు చెందిన ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి రూ.10 లక్షల విరాళం అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో లారెన్స్‌ నటించిన ‘కాంచన 3’ ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి రాలేకపోయినందున వీడియో బైట్ ద్వారా తన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అరవింద్ చిరంజీవి తరపున  చెక్కును లారెన్స్‌కు అందజేశారు. లారెన్స్‌ తన ట్రస్ట్‌ తరపున ఇప్పటివరకు వందలాది చిన్నారులకు ఆపరేషన్స్ చేయించి వారికి కొత్త జీవితాలను ప్రసాదించారు. అంతేకాదు ఎంతోమంది పేదలకు, దివ్యాంగులకు బాసటగా నిలుస్తూ వస్తున్నాడు. మున్ముందు అనారోగ్యంతో బాధపడుతున్న మరెందరో చిన్నారులను ఇదే విధంగా ఆదుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా ఏప్రిల్‌ 19న ‘కాంచన 3’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com