ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన కొడుకు కి క్షమాపణలు చెప్పిన నేచురల్ స్టార్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 12:19 PM



'జెర్సీ' సినిమాలో నాని 36 ఏళ్ల క్రికెటర్ అర్జున్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'మళ్లీరావా' ఫేమ్ గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. 'జెర్సీ' సినిమా థియేటర్లను రానున్న నేపథ్యంలో, ప్రమోషన్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న నాని, తాజాగా మరో సరదా ట్వీట్ పెడుతూ, తన కుమారుడు అర్జున్ కు సారీ చెప్పాడు. ఇప్పటికే టీజర్‌, ట్రయిలర్ లతో సినీ ప్రేక్షకులను ఆకర్షించిన సినిమాలో నానీ పేరు అర్జున్ అన్న సంగతి తెలిసిందే. నానీ కుమారుడి పేరు కూడా అర్జునే. ఇక నానీ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలో "మా డాడీ నా పేరు దొంగలించాడు" అని రాసి ఉన్న టీ షర్ట్‌ ను అర్జున్ వేసుకోగా, పక్కనే కూర్చున్న నాని తన టీ షర్టుపై అర్జున్‌ 36 అని రాసుంది. ఈ ఫొటోకు "సారీ రా జున్ను తప్పలేదు" అని క్యాఫ్షన్‌ పెట్టాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com