ఈ సంవత్సరం సంక్రాంతికి కి వచ్చిన సినిమాలలో 'ఎఫ్ 2' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెంకటేష్ మార్క్ కామెడీ వరుణ్ తేజ్ నటన తమన్నా మరియు మెహ్రిన్ అందాలతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు 75కోట్ల షేర్ తో బిగ్గెస్ట్ హిట్ సినిమా గా రికార్డు సృష్టించింది.
అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రీమేక్ కానుంది.ఇక ఈ సినిమా ఇటీవల స్టార్ మా టీవీ లో ప్రసారం కాగా 17.2 రేటింగ్స్ ను రాబట్టి బుల్లితెర ఫై కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తో పాటు ఇటీవల టెలివిజన్ లో యాత్ర ,పేట సినిమాలు ప్రసారం కాగా యాత్ర 6.2 రేటింగ్స్ ను అలాగే పేట 3.9 రేటింగ్స్ ను రాబట్టుకున్నాయి.