ప్రముఖ హాస్య నటుడు ప్రియదర్శి తన స్నేహితుడు, నటుడు అయిన సత్యదేవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు సరదాగా చేయడంతో అక్కడున్న వారందరికీ నవ్వు తెప్పించాయి. ప్రవీణ్ మద్దాలి దర్శకత్వంలో రఘు కుంచె నిర్మాతగా సత్యదేవ్ హీరోగా ‘47 డేస్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రియదర్శి కూడా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ, ‘‘47 డేస్’ చిత్రంలో సత్యదేవ్‌కు అవకాశం ఎలా ఇచ్చారు? అతను ప్రకాశ్ రాజ్ అవుదామని పరిశ్రమలోకి అడుగుపెట్టాడట. అందరూ వాడో పెద్ద గొప్పోడని అంటున్నారు. నువ్వు అంత గొప్పారా? ఇలాంటివాళ్లు హీరోలు ఎలా అవుతున్నారో నాకు అర్థంకావడంలేదు. సత్య గురించి ఎక్కువ మాటలు మాట్లాడి సమయం వృథా చేయదలచుకోలేదు. సినిమాలో కామెడీ ఏమీ లేదట. మరి సినిమా ఎలా ఆడుతుందో నాకైతే తెలీదు. సత్య కన్నా మంచి నటులు(తనను చూపిస్తూ) ఉన్నారు. వారి గురించి మాట్లాడటం నాకు మంచిదనిపిస్తోంది’ అని అన్నాడు. ప్రియదర్శి మాట్లాడుతున్నంత సేపూ అంతా సరదాగా నవ్వుకున్నారు. సత్య అయితే ఇంక చాలు ఆపరా బాబు అని ప్రియదర్శిని వేడుకున్నాడు.