ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్ళీ హాస్యనటుడిగా 'బండ్ల గణేష్' రాబోతున్నాడా ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 07:10 PM



టాలీవుడ్ భారీ చిత్రాల నిర్మాతలలో  'బండ్ల గణేష్' ఒకడు. టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన పవన్ కళ్యాణ్ ,ఎన్టీఆర్ లతో చిత్రాలను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నాడు. అంతకుముందు మొదటగా తెలుగు తెరపై హాస్యనటుడిగానే పరిచయం అయ్యాడు బండ్ల గణేష్. కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటోన్న ఆయన, మళ్లీ నటుడిగా తెరపై కనిపించనున్నాడని తెలుస్తోంది.


మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పైనే ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో హాస్యాన్ని పండించే ఒక పాత్రను బండ్ల గణేశ్ తో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించాడట. ఆ పాత్ర నచ్చడంతో వెంటనే బండ్ల గణేశ్ అంగీకరించాడని అంటున్నారు. కామెడీ ఎపిసోడ్స్ ను తనదైన శైలిలో డిజైన్ చేయడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. బండ్ల గణేశ్ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు కడుపుబ్బ నవ్విస్తుందని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com