ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సస్పెన్స్ థ్రిల్లర్ గా శ్రీదేవి బంగ్లా

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 08:11 PM



ప్రియా ప్రకాశ్ వారియర్.. ఓ ఏడాది క్రితం ఈమె ఎవరో ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు ఆమె పేరుకు పరిచయం అక్కర్లేదు. ఆ పేరు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇలా కన్నుగీటేసి అలా కోట్లాది మంది యువకుల గుండెల్ని మీటేసింది ప్రియా. ఇప్పుడు ఆమె నుండి ఓ సినిమా వస్తుంది. అదే ‘శ్రీదేవి బంగ్లా’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొత్త ట్రైలర్ వదిలారు.‘నాకు ఎంత మంది ప్రపోజ్‌ చేశారో నీకు తెలుసా?’ అని ప్రియ ఓ యువకుడ్ని ప్రశ్నిస్తున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘ప్రపంచం మొత్తం నీ నగ్న జీవితాన్ని చూస్తుంది’ అని ఓ వ్యక్తి బెదిరించడం ఆసక్తి రేపింది. శ్రీదేవి లైఫ్ కు ఈ సినిమాకు సంబందం లేకున్నా శ్రీదేవి పేరుతో టైటిల్ ఉండటం.. మొదటి టీజర్ లో బాత్ టబ్ లో హీరోయిన్ పడిపోవడం చూస్తుంటే శ్రీదేవి డెత్ సీక్రెట్ కు ఈ సినిమాకు లింక్ ఉందని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com