ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుస సినిమాలతో మళ్లీ ఫాంలోకి వస్తున్నటబు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 08:29 PM



టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసి బాలీవుడ్ కు వెళ్లింది నిన్నటితరం తార టబు. కూలీ నంబర్ 1 సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన టబు నాగార్జునకు పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకుంది. అప్పట్లో నాగ్, టబుల జోడీ అదరగొట్టిన విషయం తెలిసిందే. తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న టబు ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. అదపాదడపా తెలుగు సినిమల్లో కూడా నటిస్తుంది. 2008లో పాండురంగడు సినిమాలో నటించిన టబు ఆ తర్వాత తెలుగు సినిమా చేయలేదు.లేటెస్ట్ గా త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమాకు ఆమెను అడిగారని తెలుస్తుంది. ఇక ఆ సినిమాతో పాటుగా విరాటపర్వం 1992 సినిమాలో కూడా టబు నటిస్తుందని అంటున్నారు. నీది నాది ఒకే కథ సినిమా డైరక్టర్ వేణు ఊడుగుల డైరక్షన్ లో రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా విరాటపర్వం 1992. 1992 లో జరిగే కథగా ఈ సినిమా వస్తుంది. సో చూస్తుంటే వరుస సినిమాలతో టబు మళ్లీ ఫాంలోకి వస్తుందని చెప్పొచ్చు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com