బాలీవుడ్లో ఈ సంవత్సరం రిలీజ్ అయిన చిత్రాల్లో 'బద్లా' సినిమా ఒకటి. అమితాబ్, తాప్సీ నటించిన ఈ సినిమా దీనికి షారూక్ ఖాన్ నిర్మాత.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా రాబట్టుకుంది. అయితే, సినిమా హిట్ అయినా చిత్ర నిర్మాతలు స్పందించలేదని, బిగ్ బీ ఇటీవల ట్వీట్ పెడితే, షారూక్ స్పందిస్తూ, మీరు పార్టీ ఎప్పుడిస్తారా అని రోజూ రాత్రిపూట మీ ఇంటి ముందే ఎదురు చూస్తున్నామని సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అమితాబ్ స్పందిస్తూ, "పార్టీ కూడా నేనే ఇవ్వాలా?" అని చమత్కరించగా, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ ల మధ్య నడుస్తున్న పార్టీ వార్ కు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది తాప్సీ. "ముంబై వచ్చాక నేనే పార్టీ ఇస్తాను. ఇకనైనా వాదులాడుకోవడం ఆపండి. పార్టీకి అందర్నీ పిలుస్తాను" అంటూ తాప్సీ తన సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించింది.