ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జెర్సీ: కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నాని

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2019, 06:17 PM



ఈ ఉదయం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నాని తాజా చిత్రం 'జెర్సీ' సూపర్ హిట్టని ఫ్యాన్స్ ట్విట్టర్ లో వ్యాఖ్యానిస్తున్నారు. సినీ మైదానంలో ఈ చిత్రం సిక్సర్ కొట్టిందని అంటున్నారు. నాని తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని, స్క్రీన్ ప్లే, బీజీఎం అద్భుతమని అంటున్నారు. కొన్ని రివ్యూ వెబ్ సైట్లు ఈ సినిమాకు 4 నుంచి 4.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

ఇక సినిమాలో సెంటిమెంట్ సీన్లు చక్కగా పండాయని, కేవలం రూ. 500 పెట్టి, తన కుమారుడికి ఓ జెర్సీని కొనిచ్చేందుకు తండ్రిగా నాని పడ్డ తపన అద్భుతమని కితాబిస్తున్నారు. క్లయిమాక్స్ మరింతగా బాగుందని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com