ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంకా ఆగని 'రౌడీ బేబీ' సాంగ్ రికార్డులు

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2019, 07:30 PM



ధనుష్ , సాయి పల్లవి జంటగా నటించిన 'మారి 2' సినిమా విజయం పక్కన పెడితే ఇందులోని రౌడీ బేబీ పాట గురించి మాత్రం  మాట్లాడుకోవాలి.  ఎందుకంటే ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. దక్షిణాది సినిమాలకి సంబంధించిన వీడియోల్లో రెండు వందల మిలియన్‌ వ్యూస్‌ వచ్చినవే లేవు. అలాంటిది ఈ పాట ఇప్పటికి 400 మిలియన్‌ వ్యూస్‌కి పైగా సాధించిన రౌడీ బేబీ అతి త్వరలో అయిదు వందల మిలియన్లని దాటడం ఖాయమనిపిస్తోంది. 


అలాగే ఈ పాటకి ఇప్పటికే 2 మిలియన్ లైక్స్  వచ్చాయి.  ఏళ్ల తరబడి యూట్యూబ్‌లో మగ్గిపోతోన్న వాటికి కూడా అంతలేసి వ్యూస్‌ లేవు. కానీ ఈ పాటకి మూడు నెలల్లో ఇన్ని వ్యూస్‌ వచ్చాయి. ఇంతకాలం దక్షిణాది టాప్‌ వీడియోలకి బెంచ్‌ మార్క్‌గా వున్న రౌడీ బేబీ ఇకపై బాలీవుడ్‌ వీడియోలని సవాల్‌ చేయనుంది. దీని బారినుంచి ఎన్ని బాలీవుడ్‌ వీడియోలు తమ రికార్డుని కాపాడుకుంటాయనేది చూడాలి. సాయి పల్లవి డాన్సులు, యువన్‌ సంగీతం వెరసి ఈ పాట ప్రతి పార్టీలోను మస్ట్‌ ప్లే అన్నట్టు తయారైంది. మామూలుగా అయితే ఆడియోతో శాటిస్‌ఫై అయిపోతుంటారు కానీ రౌడీ బేబీకి మాత్రం ఆడియోతో పాటు వీడియో ప్లే చేస్తే కానీ తనివి తీరదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com