అల్లు అర్జున్‌కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు పక్క రాష్ట్రాలలోను ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలయిందంటే థియేటర్ల దగ్గర అభిమానులు కిలోమీటర్ల మేర బారులు తీరుతుంటారు. నార్త్‌లోను బన్నీ సినిమాలు డబ్ అయి విడుదలవుతుంటాయనే విషయం తెలిసిందే . అయితే బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రంలోని సీటీమార్ సాంగ్‌కి విదేశీ క్రికెటర్లు బెయిర్ స్టో, సైమన్ తమదైన స్టైల్లో స్టెప్పులేశారు. వీరి డ్యాన్స్‌ని తోటి క్రికెటర్లు చూస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం వారి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్ప్రీత్ జాస్జ్, రితా పాడిన సీటీమార్ అనే పాట చాలా పాపులర్. పలు పార్టీలలో, ఈవెంట్స్‌లో, సెలబ్రిటీల వేడుకలలో ఈ సాంగ్‌ని స్పెషల్‌గా ప్లే చేస్తుంటారు. దేవి శ్రీ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకి బాలాజీ లిరిక్స్ అందించారు.