ఆయ‌న సీన్స్ తొల‌గించి రీ షూట్ చేయ‌డం కుద‌ర‌దు

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 07:17 PM

లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌టుల‌ని బాలీవుడ్ బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. అక్ష‌య్ కుమార్, అమీర్ ఖాన్ , స‌ల్మాన్ వంటి స్టార్స్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌టుల‌ని త‌మ సినిమా నుండి త‌ప్పించి వారి స్థానంలో వేరేవారిని ఎంపిక చేసి సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. అయితే అజ‌య్ దేవ‌గ‌ణ్ ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంలో లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అలోక్ నాథ్‌ని సినిమా నుండి త‌ప్పించ‌క‌పోవ‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో అజ‌య్ క్లారిటీ ఇచ్చారు. దే దే ప్యార్ దే అనే మూవీ చిత్రీక‌ర‌ణ గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో పూర్తైంది. సినిమాని అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నామ‌ని, అలోక్ నాథ్‌కి సంబంధించిన స‌న్నివేశాలు మ‌నాలీలో ఆగ‌స్ట్‌లోనే చిత్రీక‌రించే స‌మ‌యంలో ఆయ‌న‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లు లేవ‌న్నారు. దాదాపు 40 రోజుల పాటు అలోక్‌తో క‌లిపి ప‌దిమంది ఆర్టిస్ట్‌ల‌పై స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించాం. ఇప్పుడు ఆయ‌న‌తో పాటు వేరే ఆర్టిస్ట్‌లు కూడా ప‌లు సీన్స్‌లో భాగ‌స్వాములుగా ఉన్నారు. ఒక్క‌డి సీన్స్ ఉంటే వెంట‌నే తొల‌గించే వాళ్లం. కాని కాంబినేష‌న్ సీన్స్ ఉండ‌డంతో ఇప్పుడు ఆయ‌న సీన్స్ తొల‌గించి రీ షూట్ చేయ‌డం ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. ఇది నా ఒక్క‌డి డెసిష‌న్ కాదు. చిత్ర బృందంతో కూడా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాలి. కాని ఇప్పుడు స‌డెన్‌గా ఆయ‌న‌ని సినిమా నుండి త‌ప్పించి షూట్ చేయ‌డమంటే కుద‌రుదు అని అజ‌య్ దేవ‌గ‌ణ్ వెల్ల‌డించారు.


 
Recent Post