షూటింగ్ లో గాయాల‌పాలైన బాలీవుడ్ హీరో

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 07:34 PM

బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘యురి’. ఈ సినిమాతో హీరో విక్కీ కౌశల్‌కు దేశ వ్యాప్తంగా మాంచి గుర్తుంపు వచ్చింది. ఆ చిత్రం తర్వాత విక్కీ ఓ గుజరాతీ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో విక్కీకి గాయాలయ్యాయి. హటాత్తుగా ఓ భారీ డోర్ మీద పడటంతో విక్కీ దవడ ఎముక విరిగింది. దీంతో వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స నిర్వహించిన వైద్యులు విక్కీకి మెరుగైన వైద్యం అవసరమని ముంబైకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్‌ ట్వీట్ చేశారు. విక్కీ దవడకు పదమూడు కుట్లు పడినట్లు తరణ్ పేర్కొన్నారు. విక్కీ కౌశల్ నటిస్తున్న ఈ సినిమాకు భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. గుజరాతీ హారర్ సినిమా షూటింగ్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Recent Post