మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న బండ్ల గణేష్..

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 08:16 PM

మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ మే 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతున్నది. ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నెల 17తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా నడుస్తున్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ బాబు… ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మంధాన నటించనుంది. తాజా సమాచారం ప్రకారం ఇందులో ప్రొడ్యూసర్‌గా మారిన కమెడీయన్ బండ్ల గణేష్ కనిపించబో తున్నా డని చిత్రసీమ కోడై కూస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసి, మొన్నటి వరకు రాజకీయాల్లో ఉన్న బండ్ల గణేష్.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్న బండ్ల గణేష్.. ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీపై ఆయన పెట్టుకున్న అంచనాలు తారుమారు అవడంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు చూస్తున్నారని తెలుస్తోంది.


 
Recent Post