‘మెంటల్ హై క్యా’.. టైటిల్‌పై చెల‌రేగుతున్న వివాదం!

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 09:31 PM

బాలీవుడ్ సినిమా ‘మెంటల్ హై క్యా’.. టైటిల్‌పై వివాదం చెలరేగుతోంది. ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం తెలిపింది ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్. మానసిక రోగుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా పేరుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో.. ఈ సినిమా టైటిల్‌ను మార్చాలంటూ డిమాండ్ చేశారు. కాగా.. ఈ వివాదంపై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీకి మద్దతు తెలిపింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దీంతో.. సినిమా పేరును మార్చేలా చర్యలు తీసుకోవాలని.. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, హీరోగా రాజ్ కుమార్ రావు నటిస్తున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించగా, ఏక్తా కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


 
Recent Post