ఆర్ ఆర్ ఆర్ వ‌ల్ల‌ ఇండస్ట్రీలో టాప్ హీరోల కరువు !

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 09:44 PM

ప్రతి ఏడాది సమ్మేర్ రేస్ కు కనీసం ముగ్గురు టాప్ హీరోల సినిమాలు సందడి చేయడం సర్వ సాధారణం. అయితే ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఇద్దరు రాజమౌళి వద్ద చిక్కుకుపోవడంతో భారీ సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు టాప్ హీరోల కరువు ఏర్పడింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాధారణంగా టాప్ హీరోలు అంతా  ఏడాదిలో ఒక్క సినిమా అయినా తమ వద్ద నుంచి విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు.  అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉన్న అరడజను టాప్ హీరోలలో ఇద్దరు టాప్ హీరోలు రాజమౌళి వల్ల అందుబాటులో లేకుండా పోయారు. దీనికితోడు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల బాట పట్టడంతో మరో టాప్ హీరో అందుబాటులో లేకుండా అయిపోయాడు. దీనితో ఈటాప్ హీరోల లిస్టులో కేవలం మహేష్ ప్రభాస్ అల్లుఅర్జున్ లు మాత్రమే మిగిలి ఉండడంతో భారీ సినిమాల నిర్మాతలకు దర్శకులకు టాప్ హీరోల కరువు ఏర్పడింది. గత సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ మూవీలు తీసిన సుకుమార్ కొరటాల శివలు ఒక సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్నారు అంటే ఇండస్ట్రీలో టాప్ హీరోల కరువు ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఈ సమ్మర్‌ అంతటికీ మహేష్‌ 'మహర్షి' ఒకటే భారీ సినిమా. ఆతర్వాత ఈ ఏడాది ప్రభాస్‌ 'సాహో' ఒకటే గ్యారెంటీగా రిలీజ్‌ అయ్యే సినిమాల లిస్టులో ఉంది. చిరంజీవి ‘సైరా’ విడుదల గురించి లీకులు వస్తున్నాయి కాని చాలామంది ఈమూవీ ఈ ఏడాది విడుదల అవ్వడం కష్టం అని అంటున్నారు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ పుణ్యమా అని ఇండస్ట్రీలో టాప్ హీరోల కరువు ఏర్పడింది అని అంటున్నారు. ఇక మీడియం రేంజ్ హీరోలలో నాని ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నా ఇండస్ట్రీ స్థాయిని పెంచే కలెక్షన్స్ నాని సినిమాల వల్ల రావడం కష్టం అని విశ్లేషకుల అభిప్రాయం. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే ఏడాది విడుదల అయ్యేవరకు టాప్ హీరోల కొరతతో భారీ సినిమాలను తీసే దర్శక నిర్మాతలకు కష్టకాలమే అంటూ విశ్లేషణలు వస్తున్నాయి.. 


 
Recent Post