ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టాక్సిక్' లో య‌ష్ సోదరిగా స్టార్ హీరోయిన్?

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 07:19 PM



గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'టాక్సిక్' అనే టైటిల్ ని మూవీ మేకర్ లాక్ చేసారు. 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం 10 ఏప్రిల్ 2025న పెద్ద తెరపైకి రానుంది.


ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కథానాయికగా నటిస్తుందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలి రిపోర్ట్స్ ప్రకారం, కరీనా ఈ సినిమాలో యష్ యొక్క సోదరి పాత్రను పోషిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com