ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కుబేర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 07:25 PM



శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామాకి 'కుబేర' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్నమహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.


అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com