ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హంట్'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 02:39 PM



మహేష్ సూరపనేని దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'హంట్' జనవరి 26, 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరియు ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి ఉంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 15, 2024న మధ్యాహ్నం 04:00 గంటలకు జెమినీ మూవీస్ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్ధంగా ఉంది.


ఈ చిత్రంలో శ్రీకాంత్ మరియు భరత్ నివాస్, కబీర్ దుహన్ సింగ్, మైమ్ గోపి మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భవ్య క్రియేషన్స్‌కు చెందిన వి ఆనంద ప్రసాద్‌ సమర్పిస్తున్నారు. అరుల్ విన్సెంట్ కెమెరా క్రాంక్ చేయగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com