ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో జయం రవి నటించిన 'సైరన్' ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 19న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు OTT ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.
ఈ తమిళ చిత్రంలో జయం రవి సరసన బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీత అందిస్తున్నారు. హోమ్ మూవీ మేకర్స్‌పై సుజాత విజయ్‌కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.