ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'లవ్ టుడే'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 03:40 PM



కోమలి ఫేమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' సినిమా తెలుగు-డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 18, 2022న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసారు. లవ్ టుడే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 15, 2024 సాయంత్రం 06.00 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది.

రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవానా జంటగా నటించారు. సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com