ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆ ఒక్కటి అడక్కు' విడుదల అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 04:36 PMమల్లి అంకం దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాని మూవీ మేకర్స్ మే 3న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నరేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో అరియానా మరియు హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com