ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' ఫస్ట్ స్ట్రైక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 04:54 PMటాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్‌ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లతో తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్‌ కామెడీ సినిమాకి 'విశ్వం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ స్ట్రైక్ ని విడుదల చేసారు.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ స్ట్రైక్ ఇప్పుడు యూట్యూబ్ లో 2.5 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

కావ్య థాపర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి చిత్రాలయం స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com