ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న 'టేనంట్'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 05:25 PMయుగంధర్ దర్శకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యం రాజేష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'టేనంట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకొని CBFC నుండి Aసర్టిఫికెట్ పొందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఏప్రిల్ 19న ఈ సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి వైఎస్ శ్రీనివాస్ శర్మ కథను అందించగా సాహితీ సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి యుగేందర్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు.


మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తేర్ నొరోన్హా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com