ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెజాన్ ప్రైమ్ ట్రేండింగ్ లో 'ఓం భీమ్ బుష్‌'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 06:27 PM



శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్‌' సినిమా మార్చి 22, 2024న థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క OTT రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రేండింగ్ లో ఉన్నట్లు ప్రకటించింది.

ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ మరియు అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, మరియు రాచ రవి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సన్నీ MR సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో V సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com