ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఆదిపురుష్'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 06:31 PM



బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన "ఆదిపురుష్" సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తాజా అప్‌డేట్‌ ప్రకారం, ఈ ఎపిక్ డ్రామా తెలుగు వెర్షన్ శ్రీ రామ నవమి సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఏప్రిల్ 17, 2024 ఉదయం 09.00 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం.


ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయగా, సన్నీ సింగ్, విశాల్ సేథ్, దేవదత్తా నాగే, సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్-అతుల్ జంటగా ఈ సినిమాకి  సంగీతం అందిస్తున్నారు. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com