ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మా నాన్న సూపర్' హీరోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ అతిధి పాత్ర

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 05:06 PMఅభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'మా నాన్న సూపర్ హీరో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఎమోషనల్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ రాజు సుందరం అతిధి పాత్రలో దాదాపు 20 నిమిషాలు కనిపించనున్నట్లు ఫిలిం సిర్ల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ చిత్రంలో ఆర్నా కథానాయికగా నటిస్తుంది. సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయ్ క్రిష్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్ నిర్మించింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com