ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఫ్యామిలీ స్టార్' లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 05:29 PMపరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని సరిగమ సినిమాస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్స్ గ్రాస్ $876,545 వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

వాసుకి, అభినయ, రవిబాబు, వెన్నెల కిషోర్, రోహిణి హట్టంగడి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎమోషనల్ మూమెంట్స్‌తో కూడిన సాధారణ ఫ్యామిలీ డ్రామా అని లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com