ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సారంగదరియ' టీజర్‌ను విడుదల చేసిన శ్రీవిష్ణు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 06:35 PM



చల్లపల్లి చలపతిరావు గారి ఆశీస్సులతో సాయిజా క్రియేషన్స్ బ్యానర్‌పై హీరో రాజా రవీందర్ హీరోగా ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం సారంగదరియ. పద్మారావు అబ్బిశెట్టి (పాండు) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.


ఈరోజు ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఆవిష్కరించారు. మూవీ టీమ్ మొత్తానికి తన బెస్ట్ విషెస్ తెలియజేశాడు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లలో ఉంది మరియు మే 2024లో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మోయిన్, మోహిత్, నీల ప్రియ, కాదంబరి కిరణ్, మణికందన్ రెడ్డి, అనంతబాబు, విజయమ్మ, హర్షవర్ధన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ఎం ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com