ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 07:14 PM



నాగ్ అశ్విన్‌  దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది.


వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 9, 2024న గ్రాండ్ థియేట్రికల్‌గా విడుదల చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించారు, కానీ తెలియని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. తాజా అప్‌డేట్ ప్రకారం, కల్కి 2898 AD విడుదల తేదీని ఖరారు చేయడానికి డిస్ట్రిబ్యూటర్‌లతో తుది సమావేశం ఈ రోజు రాత్రి జరుగుతుంది. అంతా సవ్యంగా జరిగితే, త్వరలోనే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com