ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గీతాంజలి మళ్ళీవచ్చింది' లోని రెంట్‌కిడబ్బు లేదు వీడియో సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 02:51 PMనూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి నటించిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' సినిమా ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. హారర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని రెంట్‌కిడబ్బు లేదు వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ మరియు ఇతర నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అంజలి 50వ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడు. కోన ఫిలింస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోన వెంకట్, ఎంవివి సినిమాస్ ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com