ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భగవంత్ కేసరి' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 05:26 PMఅనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన 'భగవంత్ కేసరి' సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 21, 2024న సాయంత్రం 05.30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది.


ఈ చిత్రంలో బాలకృష్ణ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాలో శ్రీ లీల, శరత్‌కుమార్, అర్జున్ రాంపాల్, జీవన్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ నిర్మించింది. థమన్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com