ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డియర్' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 05:32 PMఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్ కుమార్ నటించిన 'డియర్' సినిమా ఏప్రిల్ 12న విడుదల అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క ఆడియో జ్యూక్‌బాక్స్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు.

ఫ్యామిలీ కామెడీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో జివి ప్రకాష్ కుమార్ కి జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ సినిమాని వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి మరియు జి పృథ్వీరాజ్ జాజికాయ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించారు.


ఈ చిత్రంలో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం మరియు నందిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com