ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'VD12' లో మమిత బైజు

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 05:35 PMటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ 12వ చిత్రానికి జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాత్కాలికంగా VD12 అని పేరు పెట్టబడిన ఈ పీరియాడికల్ కాప్ యాక్షన్ డ్రామాలో విజయ్ డ్యూటీ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.


ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడిగా నటి మమిత బైజు నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకరా స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com