ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ప్రతినిధి 2' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 06:02 PM



టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్‌లో ప్రతినిధి సినిమా మైలురాయిగా నిలిచింది. ప్రతినిధి 2 సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని సినీ గోల్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com