ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 08:23 PMవిద్యాధర్ కగిత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ నటించిన 'గామి' సినిమా మహా శివరాత్రి శుభ సందర్భంగా మార్చి 8, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క OTT హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


ఇటీవలే ఈ సినిమా ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా జీ5 లో 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి జోడిగా నటిస్తుంది. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com