ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రత్నం' నుండి ప్రాణం నా ప్రాణం సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 03:11 PM



భరణి, పూజ తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్ హరితో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 26, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మూడవ సింగిల్ ట్రాక్ ని ప్రాణం నా ప్రాణం అనే టైటిల్ తో విడుదల చేసారు.

ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. ప్రముఖ తమిళ నటుడు-చిత్ర నిర్మాతలు సముద్రఖని మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తెకేన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com