ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియదర్శి - నభా నటేష్ చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 04:58 PM



మెగా బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి నిర్మాణ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఈ చిత్రంలో బలగం, ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్స్ సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా, నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది.


ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌కు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీ మేకర్స్ ఈ చిత్రానికి డార్లింగ్‌ అనే టైటిల్ ని లాక్ చేసినట్లు వీడియో గ్లింప్సె ని విడుదల చేసి ప్రకటించారు. అంతేకాకుండా చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com