ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 05:14 PM



ఉలగనాయగన్ కమల్ హాసన్ మరియు స్టార్ దర్శకుడు మణిరత్నం దాదాపు 17 సంవత్సరాల తర్వాత కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'థగ్ లైఫ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశల్లో ఉంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, 2025 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో త్రిష కృష్ణన్, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్ మరియు జయం రవి కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, మరియు శివ అనంతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రతిభావంతులైన ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com