ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'రంగ రంగ వైభవంగా'

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 06:46 PM



గిరీశయ్య దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన "రంగ రంగ వైభవంగా" సినిమా సెప్టెంబర్ 2, 2022న విడుదలయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో కేతికా శర్మ వైష్ణవ్ సరసన జోడిగా నటిస్తుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 21, 2024న మద్యహ్నం 02:30 గంటలకు జీ సినిమాలు ఛానెల్‌లో ప్రసారం చేయబడుతుంది అని సమాచారం.


యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, తులసి, నరేష్, ప్రభు, అలీ, సుబ్బరాజు, సత్య, ఫిష్ వెంకట్, రఘుబాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com