ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు రివీల్ కానున్న 'సత్యభామ' అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 02:57 PM



స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రాబోయే క్రైమ్ థ్రిల్లర్ 'సత్యభామ' లో కనిపించనుంది. సత్యభామలో కాజల్‌ అగర్వాల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని ఈరోజు సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుండగా, మేజర్ మరియు గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క సమర్పిస్తున్నారు. ఔరుమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com