ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదా ముయార్చి : త్రిష సెట్స్ లో జాయిన్ అయ్యేది అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 03:24 PM



కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విదా ముయార్చి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా సెట్స్ లో త్రిష మే రెండవ వారంలో అజిత్ తో పాటు జాయిన్ కానున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో అజిత్ కి జోడిగా తమిళ స్టార్ నటి  త్రిష జోడిగా కనిపిస్తుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గీలో హిందీ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం అందిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com