ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కేజీఎఫ్ 1' రీ రిలీజ్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 04:13 PM



ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF: చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. ఈ యాక్షన్ డ్రామా సినిమా రీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 27వ తేదీన అంటే శనివారం హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 MMలో విడుదల అవుతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి లేడీ లవ్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com