ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బజ్: రజనీకాంత్ 'కూలీ' ని IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించనున్నారా?

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 04:17 PM



లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కూలీ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ టీజర్ ని విడుదల చేయగా ఈ గ్లింప్సె మిశ్రమ స్పందనలను అందుకుంది.


తాజా బజ్ ప్రకారం, 50-70% కూలీ IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించబడుతుంది అని సమాచారం. ఇది నిజమైతే, లోకేష్ కనగరాజ్‌కి ఐమాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరించిన రెండో సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంది. దీనిపై మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రం 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com